Stock Market: భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు 4 d ago

8K News-15/04/2025 దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం భారీ లాభాల్లో ప్రారంభించాయి. ట్రంప్ టారిఫ్లకు విరామం, అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియడం, రెపో రేటు తగ్గిన నేపథ్యంలో మంగళవారం దేశీయ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. దీంతో సెన్సెక్స్ 1500 పాయింట్ల లాభంతో.. నిఫ్టీ 23వేల మార్క్‌న ట్రేడింగ్ ప్రారంభించింది. ఇవాళ ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 1564 పాయింట్లు పుంజుకొని 76,700 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 462 పాయింట్లు ఎగబాకి 23,288 దగ్గర కొనసాగుతోంది.